హైదరాబాద్ సిటీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నీళ్లన్నీ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కూకట్‌పల్లి నాలానుంచి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ తొణికిసలాడుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా, ప్రస్తుతం 513.50 మీటర్లకు నీరు చేరింది. అంటే పూర్తిస్థాయి నీటిమట్టంకంటే ఎక్కువ వరదనీరు చేరింది. గరిష్ఠానికి మరో మీటర్ దూరం మాత్రమే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూముల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Hyd: హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద.. తూములు ఓపెన్ చేసేందుకు అధికారులు సన్నాహాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement