Thursday, November 28, 2024

Sangareddy : అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

  • ఎంబి-2 బ్లాక్లో రియాక్టర్ బ్లాస్ట్…
  • భారీగా ఎగిసిపడుతున్న మంటలు…
  • అప్రమత్తమైన యాజమాన్యం…
  • రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు…
  • ప్రాణ నష్టం జరగలేదు-భారీగా ఆస్తి నష్టం…


పటాన్ చెరు, నవంబర్ 28, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో తెల్లవారుజామున అరోరా లైఫ్ సైన్స్ ఎంబి-2 బ్లాక్లో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున కావ‌డంతో కార్మికులు షిఫ్ట్ నుండి రిలీవ్ అయ్యే- టైం ఉండడంతో అలర్ట్ గా ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఎంబీ బ్లాక్ లో రియాక్టర్ పేలి భారీ శబ్దం రావడంతో కార్మికులంతా పరుగులు పెట్టారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.. దీంతో ఊపిరి పీల్చుకున్న పరిశ్రమ యాజమాన్యం ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉందని స్థానికులు, పరిశ్రమ యాజమాన్యం ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement