Saturday, September 21, 2024

HYD: అంబర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌లోని అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాసేపటి క్రితం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా అంబర్ పేట లో ఉన్న ఓ పెయింట్స్‌ గోదాంలో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పెయింట్స్‌ గోదాం జనావాసాల మధ్య ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా అప్రమత్తమైన పోలీసులు పెయింట్స్‌ గోదాంకు ఆనుకొని ఉన్న వారిని అక్కడి నుంచి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement