వికారాబాద్ జూలై 28 (ప్రభ న్యూస్): గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వికారాబాద్ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో మొత్తం 236 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైనట్టు వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి తెలిపారు.
ఆమె ప్రభ న్యూస్ తో మాట్లాడుతూ మండలాల వారీగా సంబంధిత రెవెన్యూ అధికారులచే నివేదికలు తెప్పించుకోవడం జరిగిందని ఉన్నతాధికారులకు ఈ నివేదికలను పంపిస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా డివిజన్ పరిధిలో 1282 మందికి చెందిన పంటలు నష్టపోయినట్టు అంచనా వేసినట్టు ఇందులో పత్తి 63 ఎకరాల్లో మొక్కజొన్న 685 ఎకరాల్లో కంది పంట 25 ఎకరాల్లో మినుము పంట 50 ఎకరాల్లో పెసర పంట 110 ఎకరాల్లో నష్టపోయినట్టు అంచనా వేసినట్టు ఆమె తెలిపారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులుచే నివేదికలు తెప్పించుకున్నామని ఈ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆమె స్పష్టం చేశారు.