Friday, September 20, 2024

Hubsiguda – విద్యార్థిని ప్రాణం తీసిన కంటైనర్…

టెన్త్ విద్యార్థిని మృతి
హ‌బ్సిగూడ‌లో రోడ్డు ప్ర‌మాదం
కంటైన‌ర్ ఢీకొట్ట‌డంతో బ‌స్సు కింద‌కు దూసుకెళ్లిన ఆటో
ఆటో డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మం
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని హ‌బ్సిగూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో టెన్త్ విద్యార్థిని సాత్విక మృతిచెందింది. ఆటో డ్రైవ‌ర్ ఎల్ల‌య్య‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉండడంతో మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు.

ప్ర‌మాదం జ‌రిగిందిలా…
హ‌బ్సిగూడ వ‌ద్ద ఆటోను వెనుక నుంచి వ‌చ్చిన కంటైన‌ర్ ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జయి ఆర్టీసీ బ‌స్సు కింద‌కు దూసుకుపోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని సాత్విక, డ్రైవ‌ర్ ఎల్ల‌య్య ఇరుక్కుపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరి క్రైన్ స‌హాయంతో ఆటోను బ‌య‌ట‌కు తీసి తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని నాచారంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో సాత్విక మృతిచెందింది. ఎల్ల‌య్య‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. మృత‌దేహాన్ని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement