Thursday, November 21, 2024

సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండి – సిపి రంగనాథ్

వరంగల్ – సెల్ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడకండి.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి కొన్ని వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా.. ఎక్కడైనా పోగొట్టు. కున్నా.. ఎవరైనా దొంగిలించినా.. ఆ బాధ వర్ణణాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైటను అందుబాటులోకి తీసుకొచ్చింది..

అదే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్). సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోలీస్ కమిషన*సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండిర్ తెలిపారు.

సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి?కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి. www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏ రోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా.. పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ మొబైల్ అయినా సీఈఐఆర్ విధానం 24 గంటల్లోపు ఫోన్ పని చేయకుండా చేస్తుంది.

సెల్ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి అక్/ ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేసి.. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

- Advertisement -

సీఈఐఆర్ వెబ్సైట్ పై అవగాహన కార్యక్రమాలు*సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం: సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఐఈఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్లో, సర్కిల్ పరిధిలో, డివిజన్ పరిధిలో బ్లూ కోర్ట్స్, పెట్రో కార్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని. సెల్ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈ ఐఆర్ అప్లికేషనన్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం అవసరమయిన పోస్టర్లు, వీడియోను విడుదల చేసారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement