నవంబర్ మాసం జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ వెల్లడించింది. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతేడాది నవంబర్ నెలతో పోల్చితే ఈ ఏడాది 25 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత రెండోసారి అత్యధిక వసూళ్లు నమోదైనట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నవంబర్ నెలలో రూ. 3,931 కోట్లు జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital