Home తెలంగాణ‌ ఆదిలాబాద్ ADB | షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

ADB | షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

0
ADB | షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

తాంసి, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చోటుచేసుకుంది. బాదితుని వివరాల ప్రకారం… మండలంలోని లింగూడ గ్రామ మాజీ సర్పంచ్ టి. శంబుకు చెందిన ఇల్లు ప్రమాద వశాత్తు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది.

దీంతో ఇంట్లో ఉన్న బీరువాకు, ఫ్రిడ్జ్ కు నిప్పంటుకొని మంటలు చెలరేగగా అప్రమత్తమైన స్థానికులు, కుటుంబీకులు వెంటనే మంటలను అదుపు చేయగా, భారీ ప్రమాదం తప్పింది. కాగా బీరువాలో ఉన్న వస్తువులు కొంతవరకు కాలిపోగా, ఫ్రిడ్జ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో భారీ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version