వరంగల్ జిల్లాలో షార్ట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఇంటిలోని సామాగ్రితో పాటు ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసి తీసుకొచ్చిన రూ. 4లక్షలు పూర్తిగా దగ్ద మయ్యాయి. అలాగే 5తులాల బంగారం, 400గ్రాముల వెండి అగ్నికి ఆహుతయ్యాయి.
దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన రాయపురి నర్సయ్య ఇటీవల ఇంటి నిర్మాణం మొదలెట్టారు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే పూరిల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం వేకువజామున ఇంటిపక్కన గల పూరిల్లు షాట్ సర్కూట్‌తో దహనమైంది. ఈ ప్రమాదంలో అప్పుగా తీసుకువచ్చిన రూ. 4 లక్షల నగదు 5 తులాల బంగారం, 400 గ్రాముల వెండి అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తంగా రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రాయపురి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.