వికారాబాద్, డిసెంబర్ 6 (ఆంధ్రప్రభ): హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కౌశిక్ రెడ్డిలను అరెస్టు చేసిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీహార్ శ్రేణులు ఆందోళన చేస్తాయన్న సమాచారంతో వికారాబాద్ పోలీసులు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే డా.ఆనంద్, కౌన్సిలర్ గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయకుమార్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మేజర్ చంద్రశేఖర్ రెడ్డిలను ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆనంద్, కౌన్సిలర్ గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయకుమార్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హౌస్ సర్వీస్ లకు పరిమితమైందని, ఇచ్చిన 6 హామీలను మరిచి ఇతర పార్టీలపై గురిపెట్టిందని వారు ఆరోపించారు. 60రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తప్పదని వారు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయడం లేదని కేవలం ప్రకటనకే పరిమితం అవుతున్నారని వారు ఆరోపించారు.