Tuesday, September 17, 2024

Hot Comments – రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభం, ముగింపు బిజెపి తోనే….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి రేవంత్‌ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు . బీజేపీలో ఆయన తనబృందంతో చేరడం ఖాయమన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను పుట్టింది బీజేపీలోనేనని.. చివరికి బీజేపీలోనే తన రాజకీయం జీవితం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్‌షాలకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎందుకు భయమో అసలు కారణాన్ని రేవంత్‌రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద బయటపెట్టుకున్నారని అన్నారు. తాను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది.. వాస్తవమా..? కాదా.. ? రేవంత్ చెప్పాలన్నారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిందేనని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement