రాజ్యసభకు కెసిఆర్,కెటిఆర్, కవితలు
గవర్నర్ గా కెసిఆర్ కు ప్రమోషన్
కెటిఆర్ కు కేంద్రమంత్రి పదవి
కవితకు బెయిల్ పక్కా
బిజెపిలో బిఆర్ఎస్ విలీనం తధ్యం
రేవంత్ సంచలన వ్యాఖ్యాలు
ఆంధప్రభ స్మార్ట్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా అది ఎప్పటికైనా విలీనం తధ్యమన్నారు.. అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
అలాగే ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ రానునట్లు చెప్పారు రేవంత్. ఇక ఖర్గే అపాయింట్ మెంట్ కోరామని, ఆయనను కలుస్తామని తెలిపారు.. ఇక రైతు రుణమాఫీ కి 5 వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామన్నారు. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకే కుటుంబంలో వారికి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్ గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వివరించారు.. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించామన్నారు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఒక్క పైసా కూడా రాలేదని మండి పడ్డారు.
రేవంత్ తో మను సింఘ్వీ భేటి
అంతకు ముందు . సీఎం ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కలిశారు. రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నానని సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.
మంత్రి వర్గ విస్తరణపై చర్చలు
సీఎం ఒకటి రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. పార్టీలో తాజా పరిణామాలు, కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో చర్చించనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు సమాచారం..