సంక్రాంతి పర్వదినాన జనం వారి వారి సొంత ఊర్లకి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాళ్ళాలు వేసి ఉన్న ఇళ్లని దొంగలు టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పలు సూచనలు చేశారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ఇప్పుడు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అలవాటుగా మారింది. అలాగే ఎక్కడ వున్నారు, ఎక్కడికి వెళుతున్నారో అది కూడా చెబుతూ ఉంటారు చాలా మంది. అయితే ఇలాంటి పొరపాట్లని చేయవద్దని తెలిపారు సీపీ మహేష్ భగవత్.
ఇంటికి తాళం వేసినట్టు దొంగలకు తెలియకుండా వ్యవహరించాలి. ఇంటి డోర్లకు లాక్ అలర్ట్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇరుగుపొరుగులో నమ్మకస్థులైన వారికి విషయం చెప్పి ఉంచాలి. సీసీటీవీ కెమెరాలను అమర్చుకుని, ఫోన్లకు అనుసంధానం చేసుకోవాలన్నారు. తాళం వేసి కర్టెన్ వేయాలి. గుమ్మం ముందు చెప్పుల జతలు కొన్ని అలానే ఉంచేయాలి. ఇంట్లో లైట్ ఆన్ చేసి ఉంచాలి. విలువైన ఆభరణాలు, నగదు, డాక్యుమెంట్లను బ్యాంకు లాకర్ లో పెట్టుకోవాలని తెలిపారు. అంతేకాదు నగదు, నగలనిప్రయాణంలో వెంట తీసుకుపోవడం కూడా సరికాదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..