Saturday, November 16, 2024

Suicide – రైలు కిందపడి హోంగార్డ్ ఆత్మహత్య

.నిజామాబాద్ ప్రతినిధి జులై (ప్రభా న్యూస్) 13:నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రైలు కిందపడి హోంగార్డ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీ యాంశమైంది. శనివారం ఉదయం రోజువారిగా డ్యూటీ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.

రైల్వే ఎస్సై కథనం ప్రకారం… నిజామాబాద్ నగరంలోని ఎల్ల మ్మ గుట్ట ప్రాంతానికి చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ (43) హోంగార్డుగా విధులు నిర్వ ర్తిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి విధులకు హాజరు కాలేదు. ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున తాగు డికి బానిసై అప్పుల బాధతో జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య తెలిపినట్లు ఎస్సై తెలి పారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement