రెండో రోజు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం గరంగరంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై కౌన్సిలర్లు గళమెత్తుతున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. కుక్కలు కరిసి జనాల ప్రాణాలు పోతున్నాయని.. అయినా పట్టించుకోరా అంటూ అధికారులను కార్పొరేటర్లు నిలదీశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ తక్కువ, ఫంక్షన్స్ ఎక్కువ అని కార్పొరేటర్లు చెబుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదంటూ….
కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేటర్లను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారన్నారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది.