Friday, November 22, 2024

Hit Rain – అచ్చంపేటలో గాలివాన, బీభ‌త్సం…

దాదాపు అరగంట పాటు కురిసిన వర్షం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పొంగిపొర్లిన డ్రైనేజీలు
రోడ్లపై, కాలనీలలో నిలిచిపోయిన మురుగు నీరు

- Advertisement -

అచ్చంపేట , ప్రభ న్యూస్ – నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో సోమవారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటల సమయంలో బలమైన ఈదురు గాలులు, వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. అచ్చంపేట పట్టణంలో ఐనోల్ గ్రామానికి సరఫరా చేసే 33 కెవి రెండు స్తంభాలు పూర్తిగా విరిగిపోగా, లక్ష్మాపూర్, అమ్రాబాద్ మండలానికి సరఫరా చేసే 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని పాల శీత‌ల కేంద్రంలో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని అచ్చంపేట విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా, పలు కాలనీలలో డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు తో కలిసిన వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement