Saturday, November 23, 2024

సర్వాయి పాపన్న చరిత్రని పాఠ్య‌పుస్త‌కాల్లో చేర్చాలి.. రేవంత్ రెడ్డి

సైదాపూర్, (ప్రభన్యూస్): మొఘుల్ చక్రవర్తిని మెడలు వంచి రాజ్యాధికారాన్ని దక్కించుకున్న వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా మండలంలోని సర్వాయిపేట గ్రామంలో కొమ్ముగుట్ట ప్రాంతాన్ని,పరిసరాలను రేవంత్ రెడ్డి పరిశీలించి,సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలలో ఆయన చరిత్రను చేర్పించాలని కోరారు.కొమ్ముగుట్టను గుర్తించాలని తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామని అన్నారు.రాచరిక పోకడలు, చేతి వృత్తి దారులు,పేదల‌ పక్షాల నిలబ‌డ్డ గొప్ప మనిషీ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజుని కావాలనే ఆరోజు ఆదొరలను అంతం చేశారని,ఇప్పుడు తెలంగాణ ముసుగులో కొంత మంది దొరలు ఈప్రాంతాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.ఈ ప్రాంతాన్ని మైనిగ్స్ నుండి రక్షణ కల్పించిన వారు పొన్నం ప్రభాకర్ అని గుర్తుచేశారు.సర్దార్ సర్వాయి పాపన్న ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు.బహుజనుల ఉండటం వల్ల అభివృద్ధి చేయడం లేదని,ఈప్రాంతతో పాటు కిలాస్ పూర్ కోట,స్ఫూర్తి ప్రదాత సర్వాయిపాపన్న దిశగా ముందుకెళ్లాలని తెలిపారు.

గ్యాస్ ధర పెంపుపై నిరసన ఒక బూటకం అని రాష్ట్ర ప్రభుత్వం కూడ ధర పెంపుపై వచ్చే నష్టం బరించకుండా,నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.పక్క దేశాలు.. పక్క రాష్ట్రాలు పోల్చే సీఎం కేసీఆర్ పెట్రోల్ ని 70 రూపాయలు ఎందుకు చేయడంలేదని ఆరోపించారు.ప్రధాని మోడీ,సీఎం కేసీఆర్ టాక్స్ రూపంలో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.9 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రాజెక్ట్ లు కట్టలేదని,ఎందుకు ఈ పక్షపాతం.. ఈప్రాంతంలో ఉన్నవారిపై ఆంధ్ర పాలనకు.. తెలంగాణ పాలనకు తేడా లేకుండా పోయిందన్నారు.ఈ వివక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని,ఇంట్లో కొడుకు లోల్లి చేస్తున్నరని,రాబోయే కాలంలో డ్రామరావు సీఎం అని చెప్పుకుంటున్నారు.లక్ష ఎకరాలలో నీటి పారుదల లేదని,ఇంటికో ఉద్యోగం లేదని, పక్క ఇండ్లు లేవని,గిరిజనులకు గిరిజన బందు లేదని అన్నారు.గౌరవెళ్లి ప్రాజెక్ట్ వల్ల ఒక లక్ష యాభై లక్షల ఎకరాలకు నీటి పారుదల చేయచ్చుకదా అని అన్నారు. సిఎం వచ్చి ఈ ప్రాంతంలో కుర్చి వేసుకొని ప్రాజెక్ట్ ని కట్టిస్తానని అన్నార‌ని,ఇంత వరకు ఫాంహౌస్ 100 ఎకరాలలో కట్టుకున్నారు కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇంతవరకు మొదలు పెట్టలేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,నాయకులు ఊసకోయిల రాఘవులు,మిట్టపల్లి కిష్టయ్య,పల్లేని రవీందర్ రావు,గుండారపు శ్రీనివాస్,ఎంపిటిసిలు చాడ చైతన్య కొండారెడ్డి,లంకదాసరి అరుణ మల్లయ్య,మాజీ సర్పంచులు జున్నుతుల రాజేందర్ రెడ్డి, పోగు రమేశ్,దోంత సుధాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు మేకల రవీందర్,అనగోని శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement