హైదరాబాద్ కురిసిన భారీ వర్షానికి హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులుకాగా, నీటిమట్టం 1762 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే వరదనీరు మూసీ నదిలో వచ్చి చేరుతుంది. మరోవైపు ఉస్మాన్‌సాగర్‌లోనూ వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.60 అడుగు వద్ద నీరు ఉన్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement