హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు దుండగులు అందులో పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.కాసేపట్లో రన్వే పైనుంచి బయల్దేరనుండగా ఆ విమానాన్ని నిలిపేసి ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాత తిరుపతి, వినోద్, రాకేశ్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ దుబాయ్ మీదుగా ఇరాక్ వెళ్తున్నట్లు గుర్తించారు.. ఆ తర్వాత వారిని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ పంపించనున్నట్లు తెలిపారు