కొత్త ఢిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు విచారించనున్నారు.. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు. కవిత ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు..దీంతో కెసిఆర్ నివాసం వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచారు. అంతేకాకుండా 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు..
ఇది ఇలా ఉంటే ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. శ్రీనివాస్ గౌడ్ చేరుకున్నారు. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపుర్ రాజు కూడా కవిత ఇంటికి వచ్చారు. ఇక ఎంపిలు నామా, రవిచంద్ర, కెకె, తదితరులతో పాటు తెలంగాణ జాగృతి కి చెందిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఎజి రామచంద్రరావు నుంచి కవిత న్యాయపరమైన సలహాలు తీసుకున్నారు.