హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీ ఎంపీ రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ నేడు తలపెట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం రక్తసిక్తమైంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకునే సమయంలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని వారిని అడ్డుకున్నారు.
ఈసందర్భంగా కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
- Advertisement -