ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డిసిపి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్ కోసం ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలు, 67 మంది సిబ్బంది బందోబస్తు లో పాల్గొన్నారన్నారు. పెద్దపల్లి లో 209 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని, ప్రతి సభ్యుడు తమ వాహనాలను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రంలోకి రావాలన్నారు. సెల్ ఫోన్లు, ఇంక్ పెన్నులు, అగ్గిపెట్టెలు పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావద్దన్నారు.