Monday, November 18, 2024

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత : పోలీస్ కమిషనర్

అహర్నిశలు కష్టపడుతూ…భాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు,
సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ విధిగా జరిగే శుక్రవారం పరేడ్ కు హజరైన పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కవాతును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …కోవిడ్ బారీన పడి కోలుకున్న తొంబై శాతం మంది పోలీస్ సిబ్బంది తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య బృందాల పర్యవేక్షణలో ఆరోగ్య పరిక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. వైద్యుల సలహాల మేరకు రోజువారి ఫిజికల్ ఫిట్ నెస్ పై దృష్టి సారించి మరింత ఉత్సాహంగా భాధ్యతలు నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు. కోవిడ్ బారిన పడిన సిబ్బంది ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రాథమిక దశలో అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించి ఆయా కుటుంబాలు క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పోలీస్ సిబ్బందితో బేటి అయి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం చేశామని, మరోసారి సిబ్బందితో బేటి అయి సర్వీస్ కు సంబంధించిన ఆంశాలపై చర్చించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాల ముఖ్యమైందని రూల్ కాల్స్, వీక్లీ పరేడ్ అన్ని పోలీస్ స్టేషన్లలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి,ఏసీపీలు అంజనేయులు, ప్రసన్న కుమార్ , విజయబాబు, సిఐలు శ్రీధర్, సర్వయ్య, రామకృష్ణ , అంజలి, RI లు రవి,శ్రీనివాస్ ,శ్రీశైలం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement