ఐదు జిల్లాల్లో రెబల్ కమిటీలు
విపక్షాల చుట్టూ బాధితులు
మూడుసార్లు అలైన్‌మెంట్ మార్పులు
పోలీస్ బందోబస్తుతో సర్వేలు
దళారుల భారీ కుట్రలు
కలెక్టరేట్లలో వినతుల కుప్పలు
ఎన్నికల ఏడాది రాజకీయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో దక్షిణాదిలో కీలకమైన హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) భూ సేకరణ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. అనాదిగా ప్రధాన జీవనా ధారమైన తమ భూములు ఇవ్వబోమంటూ కొన్ని గ్రామాల్లో రైతులు తెగేసి చెబుతున్నారు. అధికారుల సర్వే సమయాల్లో భూ సేకరణ అంశం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఐదు జిల్లాల రైతులతో ముడిపెట్టుకుని ఉన్న ఈ అంశం అసాధారణ స్థితికి వెళ్ళే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నా రు. భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతోనే సమస్య జఠిలమవుతోందని అధికారులు చెబుతున్నారు. 2021 డిసెం బర్‌లో మంత్రిమండలి ఆమోదం పొందిన రీజినల్ రింగ్ రోడ్డు అంశం కొంతకాలం పాటు ప్రణాళికలు, అంచనాల రూపకల్ప నకే గడిచిపోయింది.
గడిచిన ఏడాది కాలంగా భూ సేకరణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ రైతులు, నిర్వాసితుల ఆందో ళనలు, అడ్డుకునే కార్యక్రమాలతో ఏమాత్రం ముందుకు సాగ డం లేదు. ఇది ఎన్నికల సంవత్సరం కావండతో ప్రధాన రాజ కీయ పార్టీలు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భూస్వాములైన కొంతమంది రాజకీయ నాయకు లతో కుమ్మక్కవుతున్న అధికారులు ఈ విషయంలో రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇప్పటి వరకు మూడుసార్లు ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసినట్లు నిర్వాసితులు చెబుతున్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతాం… కానీ తమ భూములు (మొదటిపేజీ తరువాయి)
కోల్పోయే ప్రసక్తే లేదని వారంతా గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ ఆందోళనను అధికారపక్షం నాయకులెవరూ పట్టించుకోవడంతో వారంతా మూకుమ్మడిగా విపక్ష పార్టీల నేతల చుట్టూ తిరుగుతున్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు అంశం కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టుకుని ఉండడంతో బాదితులు భాజపాలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆదుకుంటారన్న గంపెడాశతో ఆయా నియోజకవర్గాల స్థాయి నాయకుల కార్యాలయాలు, ఇళ్ళ చుట్టూ బాదిత రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
సంగారెడ్డి, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రామాల వారీగా తిరుగుబాటు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇది ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగంలో 158.645కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఎనిమిది క్యాపిటల్ (ఏ) గెజిట్లతోపాటు- ఇంటర్ చేంజ్‌ల నిర్మాణానికి అదనంగా మరో మూడు గెజిట్లు- విడుదల చేసింది. దీంతో భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 యూనిట్లను ఏర్పాటు- చేసింది. వీటిలో ఏడు యూనిట్లకు ఆర్డీవోలను, మరో యూనిట్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అధికారులుగా నియమించింది. ప్రస్తుతం వీరంతా సంబంధిత భూముల యజమానుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. కానీ వారికి ఎలాంటి హామీని ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు ఈ రోడ్డు కోసం స్వాధీనం చేసుకునే భూమికి హద్దు రాళ్లు ఏర్పాటు- చేస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ పూర్తికా గానే యజమానులకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకొనేందుకు 3(డీ) కింద మరో గెజిట్‌ను విడుదల చేస్తారు. ఆలోపే మార్చిన అలైన్‌మెంట్‌ను
పునరుద్ధరించాలన్న ఉద్యమం పతాకస్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
భూ సేకరణ నిధులు రూ.2వేల కోట్లు
ట్రిపుల్‌ఆర్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడానికి నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చులో సగం భరిస్తామని కేంద్రానికి తెలపడంతోపాటు- ముందస్తుగా బడ్జెట్‌లో రూ.500 కోట్లు- కేటాయించింది. ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి భూమిని సేకరించేందు కు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ చెరో సగం భరించాల్సి ఉంటు-ంది. కానీ, రైతుల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గితే ఈ మొత్తం మరో 50శాతం పెరుగనుంది.
గజ్వేల్ కేంద్రంగా ఉత్తరభాగం భూ సేకరణ
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించే ఈ రహదారికి 166(ఏఏ)గా నేషనల్ హైవే అథారిటీ- ఆఫ్ ఇండియా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా ఉండే ఈ రహదారి నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ప్రత్యేక ప్రాజెక్టు అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు- చేశారు. ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనులు గజ్వేల్ కేంద్రంగా జరుగనున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాల యాన్ని ప్రారంభించి, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2022 నవంబర్‌లో 4 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి భూసేకరణ అవార్డ్ అందజే సేందుకు చకచకా ఏర్పాట్లు- చేస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన ప్రాం తాల్లో భూసేకరణ అవార్డ్ పాస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు- ప్రారంభించారు.
ప్రత్యామ్నాయ భూములకు నో ఛాన్స్
గతంలో మాదిరిగా రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే అవార్డు మొత్తానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సి ఉంటుంది. అవస రం మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేనందున అలాంటి అవకాశమే లేద ని అధికారులు చెబుతున్నారు. అవార్డ్ పాస్ చేయాలంటే కచ్చితంగా పర్యావరణ అనుమతి వచ్చి ఉండాలి, ఇది రావాలంటే అటవీ అనుమతుల్లో స్టేజ్-1 మంజూరు కావాలి. ఈ రెండింటిని త్వరగా పొందేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో 70 హెక్టార్ల మేర అటవీ భూములు పోనున్నా యి. అంతమేర స్థలాన్ని అటవీశాఖకు అప్పగిస్తే చెట్లను పెంచుతుంది. ప్రస్తుత పరిస్థి తుల్లో ప్రత్యామ్నాయ స్థలాలిచ్చే అవకాశం లేదు. బదులుగా ఖాళీగా ఉన్న అటవీ భూ ముల్లో రెట్టింపు స్థలంలో మొక్కలను పెంచనున్నారు. మొక్కలు నాటి, ఐదేళ్ల వరకు సంరక్షించేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖకు జాతీయ రహదారుల సంస్థ డిపా జిట్ చేయాల్సి ఉంటు-ంది. దీనికి సంబంధించి స్పష్టమైన హామీతో అటవీశాఖ స్టేజ్-1 అనుమతినిస్తుంది. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాతే స్టేజ్-2 అనుమతులొస్తాయి.