Thursday, December 26, 2024

High Court : గ్రూప్ వ‌న్ ఫ‌లితాలు వెల్ల‌డికి లైన్ క్లియ‌ర్

  • ప‌రీక్ష‌పై దాఖ‌లైన అన్ని పిటిష‌న్లు కొట్టివేసిన హైకోర్టు
  • రిజ‌ల్ట్స్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశం


హైద‌రాబాద్ – గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రిజర్వేషన్ల విషయంలో గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తూ ఫలితాలు ప్రకటించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.

రిజర్వేషన్ల కోసం ఇచ్చిన జీవోను సైతం కొట్టివేసింది హైకోర్టు.. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేసింది. రిజర్వేషన్ల విషయం తేలేంతవరకు గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని హైకోర్టులో అభిప్రాయపడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement