తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. N కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఇవాళ ఉదయం హైదరాబాద్లోని మాదాపూర్లో గల తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. దీంతో హైకోర్టు ఈ కూల్చివేతలపై స్టే విధించింది.
- Advertisement -