Saturday, November 23, 2024

రేపటినుంచి లాక్ డౌన్ అయితే గ్రామాల్లోకి వెళ్లే వాళ్లు ఎలా వెళతారు: హై కోర్టు..

 తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. అయితే హై కోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఒక్క రోజు వ్యవధిలో లాక్ డౌన్ విధిస్తే గ్రామాల్లోకి వెళ్లేవారు ఎలా వెళతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఇంత సడెన్ నిర్ణయం ఏంటి ? అని నిలదీసింది. కనీసం ఈ రోజు 10 గంటల వరకు మీకు లాక్ డౌన్ ఆలోచన లేదని.. ఇప్పుడు సడెన్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇతర ప్రాంతాల వాళ్ళు తక్కువ టైమ్ లో ఎలా వెళతారు ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేదని..  సడెన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు నిలదీసింది. గతేడాదిలా వలస కూలీలు ఇబ్బందులు పడకుండదని హై కోర్టు హెచ్చరించింది. ఇక రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రజల్లో అయోమయం ఉందని దీనిపై ప్రజలకు స్పష్టతనివ్వాలని పేర్కొంది హైకోర్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement