హైదరాబాద్, ఆంధ్రప్రభ : మియాపూర్ భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైన నేపథ్యంలో సీబీఐ విచారణ అవసరం లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. మియాపూర్ భూముల అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు వేసిన పిల్‌పై హైకోర్టు విచారణను ముగించింది. దర్యాప్తు స్థాయి నివేదికను మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ హైకోర్టుకు సమర్పించారు. 24 మందిపై 2018లోనే అభియోగపత్రాలను దాఖలు చేసినట్లు ఏసీపీ తన నివేదికలో పేర్కొన్నారు. పార్థసారధి, పీవీఎస్ శర్మ సహా 11 మందిపై హైకోర్టు కేసు కొట్టి వేసిందని ఏసీపీ నివేదికలో పొందుపరిచారు. 2019, 2021లో హైకోర్టు కేసులు కొట్టి వేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని గత నెల 10 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత జీవోలు జారీ అయ్యాయి. ఈ భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement