Friday, November 22, 2024

ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్ పై అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి హైకోర్టు నోటీసులు

ఈనెల 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శాసనసభలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపె డుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్​ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు వెల్ల‌డించారు.


దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్ర‌యించారు. వారి పిటిష‌న్ ను స్వీక‌రించిన హైకోర్టు ఈరోజు విచార‌ణ జ‌రిపింది. అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. సభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్ చేశారని కాషాయ నేతలు కోర్టుకు వివరించారు. ప్రణాళిక ప్రకారం రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ ప్రసాద్.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందించింది. అనంతరం ఈ కేసుపై విచారణ రేపటికి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement