Monday, November 25, 2024

వనమాకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు … ఎన్నిక రద్దు తీర్పుపై స్టేకి నిరాకరణ

హైదరాబాద్ – కొత్తగూడెం బీఆర్ఎస్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25న హైకోర్టు తీర్పు వెలువరించగా.. దీనిని సవాల్ చేస్తూ మళ్లీ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం కోసం తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనమా పిటిషన్​ను కొట్టివేసింది. వనమా ఎన్నిక చెల్లదన్న తీర్పును నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement