తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ నరేందర్ పిటిషన్
విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం
సహచర కార్యకర్త కాల్ చేశాడనే అభియోగంపై అరెస్ట్
మోర్నింగ్ వాక్ లో ఉండగా బలవంతంగా అదుపులోకి
నచ్చింది రాసుకుని కన్ఫెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని వాదన
నరేందర్ దాడికి ఆర్దిక సాయం చేశారన్న ప్రభుత్వ న్యాయవాది
దాడికి ప్రేరేపించింది కూడా నరేందరే
అతడిని అయన ఇంటి వద్ద అరెస్ట్ చేశాం
తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం
హైదరాబాద్ – బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ పై హైకోర్టు స్పందించింది. ఆయనేమైనా టెర్రరిస్టా… మోర్నింగ్ వాక్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ప్రశ్నించింది.. కాగా లగచర్ల దాడి ఘటనతో సంబంధం ఉందంటూ తనను అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ తనపై పెట్టిన కేసులను క్వాష్ చేయాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు
విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేయడం సరికాదని, కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిపారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది తెలిపారు. అలాగే కోర్టును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, నచ్చింది రాసుకుని కన్ఫెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని వాదించారు.
ఈ క్రమంలోనే కోర్టు కూడా పోలీసులకు కీలక ప్రశ్నలు సంధించింది. లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్‌తో నరేంద్ర ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారా?, ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా..? ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటి..? పార్క్‌లో వాకింగ్ చేస్తున్న నరేందర్‌ను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు? అతడు ఏమైనా టెర్రరిస్టా..? అంటూ ప్రశ్నలు సంధించింది.
కోర్టు ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ,. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి లేకున్నా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని అన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులకు ఆయన సాయం అందించారని, దాడికి పరోక్షంగా ప్రేరేపించారని వాదించారు. అలాగే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.