Saturday, December 28, 2024

High Court – కెటిఆర్ క్వాష్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

హైద‌రాబాద్ – ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచార‌ణ‌ను హైకోర్టు ఈ నెల 31వ తేదికి వాయిదావేసింది హైకోర్టు. అలాగే అత‌డిని అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ ఈ నెల 30వ‌రకు ఇచ్చిన అనుమ‌తిని ఈ నెల 31 వ‌ర‌కు పొడిగించింది. ఇదే స‌మ‌యంలో ఎసిబిని కౌంట‌ర్ దాఖలు చేయాల‌ని ఆదేశించింది. నేడు కోర్టులో ఎసిబి త‌రుపు న్యాయ‌వాది ఈ కేసులో కెటిఆర్ కు ఇచ్చిన మ‌ధ్యంత‌ర బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. దీనిపై కూడా ఎసిబిని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు కోరింది.

కాగా, తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. ఇక ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఇక ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బీఎల్ఎన్ రెడ్డిలకు త్వ‌ర‌లోనే నోటీస్ లు జారీ చేసి వారి స్టేట్మెంట్ ను ఎసిబి తీసుకోనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement