నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు బాలాజీ ఆలయానికి బారులు తీరారు భక్తులు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు, పోలీస్ అకాడమీ, మొయినాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చిలుకూరు బాలాజీ దేవాలయానికి గరుడ పూజ ప్రసాదం కోసం చాలామంది దంపతులు హైదరాబాద్ నగరానికి చేరుకొని చిలుకూరు దేవాలయానికి వేలాది సంఖ్యలో వెళుతున్నారు. ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి. ఈ తరుణంలోనే.. హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల నుంచి భారీగా చేరుకుంటున్నారు భక్తులు.
ఈ తరుణంలోనే.. ఔటర్ రింగ్ రోడ్డు, పోలీస్ అకాడమీ, మొయినాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర నిలిచింది ట్రాఫిక్. . ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు కూడా ఇరుక్కుపోతున్నాయి. విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగస్థులు. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయానికి ఆఫీసుకి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్ప జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ మార్గంలో పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పై ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని దారి మళ్ళించే ప్రయత్నిస్తున్నారు.