Thursday, September 19, 2024

Traffic Jam: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్..

హైదరాబాద్: ఒడికి చేరేందుకు పయనమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు, ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవ్వడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలడం లేదు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనాలను ఓ క్రమంలో ముందుకు పంపేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు సమాచారం. భద్రతాపరంగా పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు పెద్దగా కనిపించడం లేదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement