Friday, November 22, 2024

TS | భారీగా ఇతర రాష్ట్రాల మద్యం సీజ్..

సుల్తానాబాద్, (ప్రభన్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలోని ఓ గోదాములో ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.6.50 లక్షల విలువైన ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సుల్తానాబాద్ పెద్దపల్లి ఎక్సైజ్ పోలీసులు ఎన్నికల కోడ్ దృష్ట్యా తనిఖీలు చేస్తుండగా ఓ గోదాములో అక్రయంగా నిల్వ ఉంచిన సుమారు 50 ఆఫీసర్ చాయిస్ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్ననారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ డీపీఈఓ మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ… మధ్యప్రదేశ్‌లోని చంద్రాచూర్‌ జిల్లా నుండి అక్రమంగా మద్యం తరలించి కాట్నపల్లిలోని పాడుబడిన గోదాములో నిల్వ ఉంచారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ మద్యం పట్టుబడినట్లు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా మద్యం నిల్వ ఉంచిన విషయానికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్‌ ఎస్‌హెచ్‌ఓ గురునాథ్‌ రాథోడ్‌, డిటిఎఫ్‌ సిఐ శిరీష, ఎస్సైలు చిరంజీవి, పావని, జీవన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శరత్‌, వెంకటరమణ, కానిస్టేబుల్‌ కృష్ణ, శ్రీనాథ్‌, మోసెస్‌, రమేష్‌, ప్రశాంత్‌ రెడ్డి, వనిత, సంగీత, లక్ష్మి, స్రవంతిలతోపాటు- పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement