పోటెత్తుతున్న జనం
మినహాయింపుల సమయంలో నో సోషల్ డిస్టెన్స్
పాతబస్తీలో కనబడని లాకడౌేన్ వాతావరణం
హైదరాబాద్ సిటీతోపాటు జిల్లాల్లోనూ ఆ సమయంలో ఇదే సీన్
పోలీసుల హెచ్చరికలూ బేఖాతర్
హైదరాబాద్, : లాక్‌డౌన్ కారణంగా 20గంటలు.. ఇళ్ళకే పరిమితమైన జనం.. శుక్రవారం ఉదయం 6గంటలకే మార్కెట్లకు పోటెత్తారు. నాలుగుగంటలు మినహాయింపులు ఇవ్వ డంతో ఒక్కసారిగా అవసరం ఉన్నవారు, లేనివారు ప్రవాహంలా దూసుకొస్తున్నారు. అన్నిరకాల వాహనాలు.. రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జాంలు అవుతుండగా, ఈ సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూడోరోజు ఈ తరహా వాతావరణం నెలకొనడంతో.. శనివారం నుండి మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం ఎందుకు లాక్‌డౌన్ విధించిందనే అంశం పట్టించు కోకుండా.. రోడ్లపైకి రావడం పోలీసువర్గాలను కూడా ఇబ్బందిపెడుతోంది. లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు పరుస్తున్నా ఉల్లంఘనలు పెరిగి పోతున్నాయి. శుక్రవారం రంజాన్ పండగ కావడంతో ఓల్డ్ సిటీ బస్తీలు కిక్కి రిసిపోయాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు, రైతుబజార్లు, వైన్‌షాపుల దగ్గర జనం క్యూ కట్టారు. సరుకులు, బట్టలు కొనేందుకు జనం భారీగా బయటకు వచ్చా రు. దాదాపు అన్ని షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. ఒక్క ఓల్డ్ సిటీనే కాదు.. హైదరా బాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే రద్దీ వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్లలో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. గుంపులు గుంపులుగా పబ్లిక్ తిరుగుతుండడంతో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ జాం కావడంతో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా రద్దీ కొనసాగుతోంది. దాంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారులకు అనుమతి ఉంది. ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది సామాజిక దూరాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఆరుశాతం మంది కరోనా వైరస్‌ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానం లో ఉండగా, ఇక్కడ కొందరు ఏమా త్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అస లు లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పో లీసులు కఠినంగా వ్యవహరిం చాలని పలువురు డిమాండ్ చేస్తు న్నారు.
అ యితే రెండు, మూడు రోజులు అయితే ఉదయం సమ యంలోనూ రద్దీ తగ్గి సాధారణ పరి స్థితి నెలకొం టుందని అంచనా వేస్తు న్నారు. అత్య వసరమైతేనే బయటకు రావాలని, ఖచ్చితంగా డబుల్ మా స్క్ ధరిం చడంతో పాటు సామాజిక దూరం పాటించాలని కోరు తు న్నారు. సెకండ్ వేవ్ భయాలు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు బయటకు రావడం లేదు. ప్రజలు ఇదే పద్దతిలో రెండు, మూడు వారాలు సహకరించాలని వైద్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.