తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. శనివారం నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు
By mahesh kumar
- Tags
- heavy rains
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Meteorological Centre Hyderabad
- monsoon
- Most Important News
- Rain fall
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana rains
- Telangana Today Live
- Telangana Today News Live
- telangana weather news
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement