హైదరాబాద్ నగరంలో శనివారం భారీవర్షం పడింది. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మోహిదీపట్నం, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మలక్‌పేట్, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో ప్రధాన నగరంలోని రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వచ్చే రెండ్రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: త్వరలో సినీ పెద్దలలో కేసీఆర్ చర్చలు: మంత్రి తలసాని