వరంగల్ … బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం జలవలయంగా మారింది. పరకాల భూపాలపల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఉగ్రరూపం దాల్చిన ప్రవహిస్తోంది. హనుమకొండ ఛత్తీస్గడ్ ప్రధాని రహదారిలో కటాక్షపూర్ చెరువు మత్తడి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోవిందరావుపేట మండలంలోని దయ్యాలవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందరావుపేట దళిత కాలనీ పసరాలోని ఎస్సీ కాలనీ, పాత నాగారం,సుప్రసిద్ధ మేడారం చుట్టూ వరదనీరుతో జల వలయంగా మారింది.
హనుమకొండ ఎటునారం ప్రధాని రహదారులు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి.వరంగల్ నగరంలోని హనుమకొండ కాజీపేట వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలినట్టుగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ హనుమకొండ ప్రధాన రహదారిలోని నయం నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి వందలాది కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి జిల్లాలోని ఆకేరు మున్నేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.