Saturday, November 23, 2024

భారీ వర్షంతో రైతులలో వెల్లివిరిసిన సంతోషం

.సిరికొండ, సెప్టెంబర్ 3( ప్రభ న్యూస్ ): నిజాంబాద్ జిల్లా ఆదివారం సిరికొండ మండలంలో కురిసిన భారీ వర్షానికి రైతుల మొముల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.ఎండ వేడికి తట్టుకోలేక బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో వర్షకాలం వేసిన పంటల మీద ఆశలు వదులుకోవలసిన పరిస్థితి నెలకొంది.కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలని రైతులు అనుకుంటున్నా తరుణంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి రైతుల ఆనందానికి అవధులు లేవు.

గత జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులు నాట్లు వేసిన మడుల ఒడ్లు ధ్వంసమై తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారుల ప్రాథమిక నీవేదికల ప్రకారం ఒక్క సిరికొండ మండలంలో 1085 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందంటే పంట నష్టం ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది.ఆగస్టు మాసంలో వర్షాలు లేక పోగా, ఎండలు వేసవి కాలాన్ని తలపించాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వేడి, ఉక్కపోతకు తట్టు కోలేక ప్రజలు తల్లడిల్లారు

.ఈ ఏడు ఆగస్టు నెలలో వర్షాలు లేక పోవడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే తొలి సారని ప్రజలు చర్చించుకుంటున్నారు.చెరువుల వద్ద సాగు చేస్తున్న వరి పొలాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాని బోరు బావుల్లో నీరు అడుగంటడంతో బోరు బావుల వద్ద సాగు చేస్తున్న వరి పంట పొలాలు కొన్ని నీరందక ఎండి పోయే దశకు చేరుకున్నాయి.ఈ తరుణంలో కురిసిన భారీ వర్షం వరి పంటలతో పాటు ఇతర పంటలకు ఎంతో మేలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement