Saturday, November 16, 2024

Telangana: రాబోయే 48 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు..

హైద‌రాబాద్: గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచి కొడుతున్న సంగ‌తి తెలిసిందే.. మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాబోయే 48గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది.

హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్–మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్, నిజామాబాద్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌, నాగ‌ర్‌ క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌ పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో రాబోయే 48 గంట‌ల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

ఉరుములు, మెరుపులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, గంట‌కు 30నుంచి 40 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement