Tuesday, November 26, 2024

వెదర్ అలర్ట్: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో రుతుపవనాలు చురు‌కుగా ఉన్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఏపీ పరి‌సర ప్రాంతాల్లో ఉప‌రి‌తల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభా‌వంతో జూలైలో సాధా‌రణ వర్షం కానీ, అంత‌కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement