తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. కామారెడ్డి, జహీరాబాద్‌లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. కాగా, కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతుంది.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వాన భారీగా పడతుండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ కోసం ఏర్పాట్లపై అంతరాయం చోటుచేసుకుంది. వర్షానికి టెంట్లో నుంచి నీరు కురుస్తుండటంతో.. పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానతో పాటు ఈదురు గాలులకు టెంటు కూలడంతో.. సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తడవకుండా అవస్థలు పడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి EVM పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. EVM మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షపు నీరు పడుతుండటంతో.. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతున్నాయి.