Sunday, November 17, 2024

హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

హైదరాబాద్ నగరంలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి కురిసిన జోరువానతో చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుండ‌టంతో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. అమీర్ పేట, మెహిదీపట్నం, బండ్లగూడ జాగీర్,  కొండాపూర్, మాదాపూర్, గ‌చ్చిబౌలి ఎల్బీ నగర్, తార్నాక, జీడిమెట్ల, అల్వాల్, హయత్ నగర్, నాగోలు, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీ ఈదురుగాలులు వీస్తుండ‌టంతో క‌రెంట్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులు ఉపశమనం పొందారు.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జంట నగరాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఇక రాష్ట్ర‌ వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ప‌లుచోట్ల పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలిస్తుంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో తేలిక‌పాటి వ‌ర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది

ఇది కూడా చదవండి:అరేబియా సముద్రంలో అల్పపీడనం – 16 నాటికి తుపాన్‌గా రూపాంతరం

Advertisement

తాజా వార్తలు

Advertisement