Thursday, November 21, 2024

పాల‌మూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

దేవరకద్ర, (ప్రభ న్యూస్) : పాల‌మూరులో ఉన్న‌ట్టుండి వ‌ర్షం మొద‌లైంది. ఉరుములు, మెరుపుల‌తో దంచికొడుతోంది. దేవ‌ర‌క‌ద్ర‌ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. రెండు మూడు రోజుల నుంచి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. వివిధ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది బ‌య‌ట‌కు రాకుండా ఆగిపోయారు. వర్షాలకు కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement