వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా వికారాబాద్, దారుర్ , నవపేట్, పూడూర్, మోమిన్ పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉరట కలిగింది. ఆషాఢ మాసం ముగింపుతో వర్షం రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుపనులు మొదలు పెట్టినా, అదను దాటిపోవడంతో కాస్త ఆందోళన నెలకొంది. ఈ వర్షంతో సాగు పనులు మళ్లీ మొదలుకానున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement