Sunday, September 8, 2024

పంజాగుట్ట‌లో భారీ వ‌ర్షం.. సికింద్రాబాద్ లో వ‌డ‌గ‌ళ్ల వాన‌

హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురుస్తోంది. పంజాగుట్ట‌లో భారీ వ‌ర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ లో ప‌లుచోట్ల వ‌డ‌గ‌ళ్ల వాన కురుస్తోంది..ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా తెలంగాణ‌కి ఆరెంజ్ ఎల‌ర్ట్ ని జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో గంట‌కి 40 నుండి 50కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి..నారాయ‌ణగూడ‌లో భారీ వ‌ర్షం కురుస్తున్నా..హ‌నుమాన్ శోభాయాత్ర కొన‌సాగుతూనే ఉంది.రానున్న రెండు రోజుల్లో వ‌డ‌గ‌ళ్ల‌తో కూడిన వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement