Tuesday, November 26, 2024

కరీంనగర్ లో భారీ వర్షం కూలిన బస్ షెల్టర్

కరీంనగర్ నగరం తో పాటు పలు చోట్ల గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలో జ్యోతిభా పూలే పార్క్ ఎదురుగా బస్ షెల్టర్ కూలింది. ఆ సమయానికి ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జ్యోతినగర్ తో పాటు పలుచోట్ల చెట్లు నెలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి..

గురువారం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 17న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 18న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆయా జిల్లాలో అధికారులు అప్రమత్తమైనరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement