హైదరబాద్ లో నేటి సాయంత్రం నుంచి వర్షం కుమ్మేస్తున్నది.. ఉదయం నుంచి ఎండకాస్తుండగా,సాయంత్రం ఆకస్మికంగా మేఘాలు కమ్ముకున్నాయి .. మోస్తరుగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత విశ్వరూపం చూపింది.. గంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో భాగ్యనగరంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్,కోఠి, హుస్సేన్ సాగర్ ఎల్బీనగర్, లకిడీకాపూల్, అమీర్ పేట్, ఖైరతాబాద్, ఛార్మినార్, సికింద్రాబాద్,ఉప్పల్ , కూకట్పల్లి, హైదర్‌నగర్, మూసాపేట, అల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్రావు నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌లో వర్షం భారీగా పడుతున్నది
వర్షపు నీటితో రోడ్లన్ని చెరువులుగా మారాయి.. కాలనీలు , పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. రోడ్లపై మోకాటిలోతులో వర్షం నీరుచేరడంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు స్మార్ట్ఫోన్లకు మెస్సేజ్ ద్వారా అలర్ట్ చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ రంగంలోకి దిగి వర్షపు నీటిని తొలగించే పనిలో పడ్డాయి.. పోలీసులు ట్రాఫిక్ ను పునరిద్దురించే చర్యలు చేపట్టారు.. వర్షం ఇప్పటికీ తగ్గకపోవడంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు..