నిజామాబాద్ ప్రతినిధి జూన్ (ప్రభా న్యూస్) 22: వేసవిలో ఎండలకు ప్రజలు అల్లాడి పోయారు. వర్షాకాలం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్న వర్షాలు లేకపోవ డంతో ఉక్కపోతలతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. శనివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో రాత్రి 8 గంటల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసిం ది.ఆయా డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చంద్రశే ఖర్ కాలనీ, మాలపల్లి, ఆటోనగర్, గౌతమ్ నగర్, తదితర ప్రాంతాలలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయ్యాయి. కాగా ఈ సీజన్లో ఇంత భారీ ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షం పడటం ఇదే తొలిసారి.
నేల కూలిన భారీ వృక్షం ..
నిజాంబాద్ నగరంలో ఈదుర గాలులతో భారీ వర్షం కురవడంతో రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద భారీ వృక్షం నేలకూలింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వృక్షం నేల కూలడంతో ప్రజలు ఆందో ళన గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.